జానీ మాస్టర్ రేప్ చేసే నాటికి ఆమెకు 16 ఏళ్లే.. కస్టడీ తీసుకుంటారా?  
                                       
                  
				  				  
				   
                  				  ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అసిస్టెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జానీ మాస్టర్‌ను హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి.. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 
 				  																												
									  
	 
	ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ను విచారించే సమయం దొరకకపోవటంతో.. పోలీసులు కస్టడీకి కోరుతున్నారు. ఈ క్రమంలోనే.. జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జానీని కస్టడీకి తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. 
				  
	 
	ఇక రిమాండ్ రిపోర్టులో బాధితురాలు తనపై పాల్పడిన అకృత్యాలను పొందుపరిచారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. జానీ మాస్టర్ బాధితురాలిపై అవుట్ డోర్ షూటింగ్స్ సందర్భంగా హోటల్స్‌లోనూ, క్యార్ వాన్‌లోనూ లైంగిక దాడి చేసేవాడని.. ఈ విషయం బయట చెప్తే అసిస్టెంట్ పోస్టులో నుంచి తీసేస్తానని.. ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బాధితురాలిని బెదిరించాడని రిమాండ్ రిపోర్టులో వుంది.
				  																																			
									  
	 
	ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2020 జనవరిలో జానీ మాస్టర్ రేప్ చేసే నాటికి బాధితురాలి వయసు 16 సంవత్సరాల 11 నెలల 13 రోజులు. ఈ మేరకు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ కూడా బాధితురాలు పోలీసులకు అందజేసింది. 
				  																		
											
									  
	అప్పటికి బాధితురాలు బాలిక కాబట్టి.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్.. పోక్సో కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు.