శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 10 ఆగస్టు 2017 (19:19 IST)

అలాంటి కథలపైనే దృష్టి పెడతా - బోయపాటి శ్రీను, ప్రగ్యా ఊపేసింది(వీడియో)

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన సినిమా తీశాడంటే ఇక హిట్టవ్వాల్సిందే. ఆ సినిమాలో నటించిన హీరోకు మామూలు ఇమేజ్ కాదు.. ఆ స్థాయిలో పెరుగుతుంది. బాలక్రిష్ణ లాంటి అగ్ర హీరోని మళ్ళీ కొత్తగా చూపించిన డైరెక్టర్ బోయపాటి. బోయపాటి సినిమాలో అం

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన సినిమా తీశాడంటే ఇక హిట్టవ్వాల్సిందే. ఆ సినిమాలో నటించిన హీరోకు మామూలు ఇమేజ్ కాదు.. ఆ స్థాయిలో పెరుగుతుంది. బాలక్రిష్ణ లాంటి అగ్ర హీరోని మళ్ళీ కొత్తగా చూపించిన డైరెక్టర్ బోయపాటి. బోయపాటి సినిమాలో అంటే చాలామంది ఎగబడి మరీ నటించడానికి సిద్థంగా ఉంటారు. ఆయన కథ అలాంటిది. మంచి కథను ఎంచుకుంటే తప్ప సినిమా తీయరు. 
 
డైరెక్షన్ చేసింది కొన్ని సినిమాలే అయినా అన్నీ హిట్లే. ఎలాంటి హీరోను అయినా యాక్షన్ సన్నివేశాల్లో నటింపజేసి ప్రేక్షకుల నుంచి ఈలలు వేయించేలా చేస్తుంటారు బోయపాటి. కానీ బోయపాటి రివర్సుగా 'జయ జానకి నాయక' అనే ప్రేమ కథా చిత్రానికి డైరెక్షన్ వహించారు. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. విభిన్నమైన కథతో సినిమాను తీసినట్లు బోయపాటి చెబుతున్నారు. 
 
తాను యాక్షన్ కథా డైరెక్టర్ మాత్రమే కాదు.. ఎలాంటి సినిమాలనైనా తీయగలను అని నిరూపించడానికి జయ జానకి నాయకి సినిమా సరిగ్గా సరిపోతుందంటున్నారు. త్వరలో బాలక్రిష్ణతో మరో సినిమా చేయడానికి కూడా సిద్థంగా ఉన్నట్లు మీడియాకు తెలిపారు బోయపాటి. ఇదిలావుంటే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ అందాలను ఆరబోయించారని అంటున్నారు. చూడండి ఈ ట్రెయిలర్లో....