జయ జానకి నాయక కథ ఏంటి(వీడియో)
జయ జానకి నాయక చిత్ర కథను చూస్తే... కేంద్ర మంత్రి పవార్ (సుమన్) కుమారుడు కాలేజీలో అల్లరి చేస్తుంటాడు. అతని అల్లరికి భయపడి ఓ అమ్మాయి టీసీ తీసుకుని వెళ్లిపోతుంది. ఆమెను స్వీటీ (రకుల్ ప్రీత్‌సింగ్) ఆపుతుంది. అది గమనించిన ఆకతాయి ఆమెపై కూడా దౌర్జన్
జయ జానకి నాయక చిత్ర కథను చూస్తే... కేంద్ర మంత్రి పవార్ (సుమన్) కుమారుడు కాలేజీలో అల్లరి చేస్తుంటాడు. అతని అల్లరికి భయపడి ఓ అమ్మాయి టీసీ తీసుకుని వెళ్లిపోతుంది. ఆమెను స్వీటీ (రకుల్ ప్రీత్‌సింగ్) ఆపుతుంది. అది గమనించిన ఆకతాయి ఆమెపై కూడా దౌర్జన్యం చేయాలనుకుంటాడు. అప్పుడు గగన్ (సాయిశ్రీనివాస్) ఆపుతాడు.
గగన్‌కి తోడుగా అతని తండ్రి చక్రవర్తి (శరత్‌కుమార్), సోదరుడు (నందు) కూడా ఫైట్ చేస్తారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని అశ్వత్ నారాయణ వర్మ (జగపతిబాబు) ఇంటి వేడుకకు కేంద్ర మంత్రి హాజరవుతాడు. పరువు కోసం ప్రాణాలను లెక్కచేయని వర్మ తన కుమార్తె ఆత్మహత్యకు, కాబోయే అల్లుడి చావుకు కారణమవుతాడు.
మరోవైపు డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అంతవరకు మద్యం వ్యాపారంలో ఉన్న పవార్ దృష్టి ఈ క్రాంటాక్ట్ మీదపడుతుంది. పవరు కోసం పాటుపడే పవార్, పరువు కోసం పాకులాడే వర్మ ఆడుతున్న గేమ్‌లోకి స్వీటీ అలియాస్ జానకి (రకుల్ ప్రీత్‌సింగ్) చేరుతుంది. ఆమెను వారిద్దరి నుంచి హీరో ఎలా కాపాడుకున్నాడు? అనేది అసలు సినిమా. వీడియో చూడండి...