సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (16:09 IST)

జయం రవి విడాకుల కేసు : రాజీకి ప్రయత్నించండి.. చెన్నై ఫ్యామిలీ కోర్టు

jayam ravi arti ravi
హీరో జయం రవి విడాకుల కేసులో చెన్నై ఫ్యామిలీ కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా రాజీకి ప్రయత్నించాలని, ఇందుకోసం మధ్యవర్తిత్వ సమావేశాలు నిర్వహించాలంటూ సూచన చేసింది. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ జయం రవి కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిదే. 
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో హీరో జయం రవి స్వయంగా కోర్టుకు హాజరుకాగా, ఆర్తి మాత్రం వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. 
 
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని.. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. ఇందుకోసం మధ్యవర్తిత్వ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. అదేసమయంలో ఖచ్చితంగా విడిపోవాలనుకుంటే అందుకు కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. 
 
కాగా, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్న జయం రవి - ఆర్తి రవి దంపతులు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో జయం రవి భార్య నుంచి విడిపోవాలని భావించారు. అయితే, ఆర్తి రవి మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తనకు తెలియకుండానే విడాకులపై బహిరంగ ప్రకటన చేశారంటూ సంచలన ప్రకటన చేశారు.