1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 జులై 2023 (16:11 IST)

చెన్నైలో ఘ‌నంగా ప్రారంభ‌మైన జ‌యం ర‌వి చిత్రం జీనీ

Jayam Ravi, Kriti Shetty, Kalyani Priyadarshan, Vamika Gabb and others
Jayam Ravi, Kriti Shetty, Kalyani Priyadarshan, Vamika Gabb and others
జ‌యం ర‌వి.. కోలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖ హీరోల్లో ఒక‌రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో, వైవిధ్యమైన పాత్ర‌ల‌తో అద్భుత‌మైన న‌టుడిగా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఆయన నెక్ట్స్ మూవీ ‘జీని’ బుధవారం చెన్నైలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై డా.ఐస‌రి కె.గ‌ణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
అర్జున‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, వామికా గ‌బ్బి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దేవ‌యాని కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. మ‌హేష్ ముత్తుస్వామి సినిమాటోగ్ర‌పీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉమేష్ కె.కుమార్ ఆర్ట్ వ‌ర్క్‌, ప్ర‌దీప్ ఇ.రాఘ‌వ్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప‌లు హాలీవుడ్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌కు స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసిన యానిక్ బెన్ ఈ సినిమాకు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్‌ చేస్తున్నారు. కె.అశ్విన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ సినిమాకు కె.ఆర్‌.ప్ర‌భు క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న 25వ సినిమా ఇది. భారీ బ‌డ్జెట్‌తో మేక‌ర్స్ మూవీని నిర్మిస్తున్నారు. తమిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మూవీ రిలీజ్ అవుతుంది.