శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (09:49 IST)

‘రాజులైనా, బంటులైనా....' అంటూ మూడో పాటతో ‘కాటమరాయుడు’ వచ్చాడు (Audio)

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా డాలీ దర్శకత్వంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రంలోని మూడో పాటను ఆదివారం విడుద

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా డాలీ దర్శకత్వంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రంలోని మూడో పాటను ఆదివారం విడుదల చేశారు. ‘రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా..’ అని సాగే ఈ పాట మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
 
ఇదిలావుండగా, ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ అరుదైన మైలురాయిని దాటేసింది. ఫిబ్రవరి 4న యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ ఆదివారానికి కోటి వ్యూస్‌ను క్రాస్‌ చేయగా, 2.52 లక్షల మంది లైక్‌లు పొందింది. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా ఇది నిలిచినట్లు సమాచారం. ఫ్యాక్షనిస్టు ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.