జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్‌కు వివాహం.. వీడియోలు వైరల్
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్, శివానీ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తారక్ కుటుంబం ఎంట్రీ ఇచ్చిన వేళ హౌస్ ఫుల్ హంగామా నెలకొంది. పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట సందడి చేస్తున్నాయి.
వధువు శివానీ నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ - స్వరూప దంపతుల కుమార్తె. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ కావడం విశేషం.
2023 నవంబర్ 3న నార్నే నితిన్, శివానీల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరగగా, ఇప్పుడు అక్టోబర్ 10న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ దంపతులతో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు, ఇతర సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నార్నే నితిన్ 2023లో మ్యాడ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచే ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అభిమానులను మెప్పించాడు. అనంతరం ఆయ్, మాడ్ స్క్వేర్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధించి ప్రామిసింగ్ యాక్టర్‌గా నిలిచాడు. ఇటీవలే శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.