శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (13:42 IST)

'బిగ్ బాస్' హౌస్‌కు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్లు.. ఇక సందడే సందడి...

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ముగింపు దశకు చేరుకోనుంది. ఈ షోలో పలువురు నటీనటులు పాల్గొన్నారు. వీరిలో కొందరు ఎలిమినేట్ కాగా, మరికొందరు ఇం

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ముగింపు దశకు చేరుకోనుంది. ఈ షోలో పలువురు నటీనటులు పాల్గొన్నారు. వీరిలో కొందరు ఎలిమినేట్ కాగా, మరికొందరు ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు.
 
అదేసమయంలో ప్రతి శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉండే కొత్త చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు ఈ హౌస్‌లోకి ప్రవేశిస్తూ మరింత సందడి చేస్తున్నారు. ఈ కోవలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కొత్త చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఈనెల 21వ తేదీన రిలీజ్ కానుంది. 
 
ఇందులో హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించారు. ఈ నటీమణులిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో వీరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదేసమయంలో శనివారం కావడంతో, జూనియర్ కూడా షోలో కనిపించనున్నాడు. 
 
మరోవైపు, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ప్రచారంలో భాగంగా నివేదా, రాశీ ఖన్నాలు బిగ్ బాస్‌లో సందడి చేయనున్నారు.