బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:50 IST)

'అర్జున్ రెడ్డి' ఆదుకున్నాడు... అందువల్లే ముద్దు సీన్లలో ఫ్రీగా నటించా : షాలిని పాండే

తన జీవితంలో అనేక సినిమా కష్టాలు ఉన్నాయని "అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలిని పాండే చెపుతోంది. పైగా, తాను కష్టాల్లో ఉన్నపుడు అర్జున్ రెడ్డి (ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ) తనను ఆదుకున్నాడని చెప్పింది.

తన జీవితంలో అనేక సినిమా కష్టాలు ఉన్నాయని "అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలిని పాండే చెపుతోంది. పైగా, తాను కష్టాల్లో ఉన్నపుడు అర్జున్ రెడ్డి (ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ) తనను ఆదుకున్నాడని చెప్పింది. అందుకే ఈ చిత్రంలో ముద్దు సీన్లు ఉన్నాయనీ కథా చర్చల సమయంలో చెప్పకున్నప్పటికీ.. ఆ తర్వాత తెలిసినా ఫ్రీగా నటించగలిగినట్టు తెలిపింది. 
 
అర్జున్ రెడ్డి చిత్రంలో తనకు అవకాశం ఎలా వచ్చిందన్న అంశాన్ని ఆమె వివరిస్తూ.... నటన అంటే నాకున్న పిచ్చి కుటుంబాన్ని నాకు దూరం చేసింది. సినీ కుటుంబాలకు చెందిన వారికే సినిమాల్లో ఛాన్సులు రావడం కష్టం. అలాంటిది నాలాంటివారికి అంత త్వరగా అవకాశాలు రావు అన్న విషయం ముంబైకి వచ్చిన తర్వాత బాగా తెలిసింది. 
 
సినిమాల్లో అవకాశాల కోసం చాలా చోట్ల ప్రయత్నించేదాన్ని. ఇక నాకు సినిమా అవకాశాలా కోసం తిరిగే ఓపిక కూడా లేదనిస్తున్న టైంలో ‘అర్జున్ రెడ్డ్డి’ సినిమాలో అవకాశం వచ్చింది. నేను నటించిన హిందీ సీరియల్‌ చూసి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి గారు. హీరో విజయ్‌ దేవరకొండ నన్ను కలిశారు. కథ నచ్చడంతో ఓకే చెప్పాను. అలా అర్జున్ రెడ్డితో నా సినిమా కష్టాలు తీరిపోయాయి.
 
నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉంటాయని చెప్పలేదు. ఆ విషయం చెప్పి ఉంటే చేసి ఉండేదాన్ని కాదేమో! కానీ విజయ్ దేవరకొండ కావడంతో ఆ సన్నివేశాల్లో ఫ్రీగా నటించినట్టు తెలిపింది. 
 
సినిమా పూర్తయిన తరువాత హీరో విజయ్‌తో కలిసి సినిమా చూశాను. విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకైతే కలగలేదు. కానీ సినిమా విడుదల అయిన తరువాత ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూస్తుంటే మాత్రం కొత్తదనానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది అనిపించిందని చెప్పింది. సినిమా అంటేనే గ్లామర్‌ ప్రపంచం. ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత గ్లామర్‌ పాత్రలు చేయను అంటే కుదరదు. లిమిట్‌ మించని గ్లామర్‌కు ఓకే అని షాలిని పాండే చెప్పుకొచ్చింది.