బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (06:04 IST)

ఇష్టమైన హీరో దేవరకొండ.. అందుకే అన్నీ సమర్పించా : షాలిని పాండే

'అర్జున్ రెడ్డి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే.. తనకు ఇష్టమైన హీరో ఎవరన్నది బహిర్గతం చేసింది. ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ అంటే తనకు అమితమైన ఇష్టమని చెప్పుకొచ్చింది.

'అర్జున్ రెడ్డి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే.. తనకు ఇష్టమైన హీరో ఎవరన్నది బహిర్గతం చేసింది. ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ అంటే తనకు అమితమైన ఇష్టమని చెప్పుకొచ్చింది. 
 
ఈ చిత్రం హిట్ తర్వాత షాలినికి ప‌లు షాప్ ఓపెనింగ్స్‌కి కూడా ఆహ్వానాలు వస్తున్నాయి. తాజాగా ఈ భామ సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి నెల్లూరుకు వచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానుల హాజరయ్యారు. 
 
దీంతో ఆమె కాస్త అస్వ‌స్థ‌త‌కి లోన‌య్యారు. అయితే వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. అయితే, ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్‌లో మాట్లాడింది.
 
ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ, తనకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ, అందుకే అతనితో కలిసి స్వేచ్ఛగా నటిస్తానని చెప్పింది. ఇకపోతే.. ‘మహానటి’ చిత్రంలో తాను నటిస్తున్నానని, అయితే, అందులో తాను నటించబోయే పాత్ర గురించి ఇప్పుడే చెప్పనని మరో అభిమాని ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. 
 
అలాగే, ‘100% లవ్’ తమిళ రీమేక్ లో నటిస్తున్నానని ఇంకో ప్రశ్నకు సమాధానంగా షాలిని పాండే చెప్పింది. కాగా, "అర్జున్ రెడ్డి" చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రంలో షాలిని న‌ట‌న‌కి ఇంప్రెస్ అయిన నిర్మాత‌లు ఒక్క‌సారిగా ఈ అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ ఇస్తున్న విషయం తెల్సిందే.