శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:50 IST)

15 యేళ్ల తరువాత 'మన్మథుడు'తో జత కట్టనున్న జ్యోతిక?

రొమాంటిక్ హీరోగా.. పల్లెటూరి బుల్లోడుగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జునను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. దాంతో ఆ పాత్ర పేరుతోనే నాగార్జున తాజాగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
 
కాగా, ఈ సినిమాలో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. అయితే డేట్స్ ఖాళీ లేని కారణంగా తాను ఈ సినిమా చేయలేనని నయనతార చెప్పినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా 'జ్యోతిక' పేరు తెరపైకి వచ్చింది. 
 
ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా సమాచారం. 15 యేళ్ల క్రితం కింగ్ సరసన 'మాస్' సినిమాలో నటించిన జ్యోతిక... రీ ఎంట్రీ తరువాత కథల ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ వహిస్తోన్న విషయం తెలిసిందే, మరి... ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.