గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (09:00 IST)

కుమార్తె కంటే చిన్న వయసు అమ్మాయిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో

ప్రేమ గుడ్డిదన్నారు మన పెద్దోళ్లు. ఇది నిజం చేస్తూ ఓ వ్యక్తి తన కంటే 29 యేళ్ల చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ.

ప్రేమ గుడ్డిదన్నారు మన పెద్దోళ్లు. ఇది నిజం చేస్తూ ఓ వ్యక్తి తన కంటే 29 యేళ్ల చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ. ప్రస్తుతం ఈయన వయసు 72 యేళ్ళు. ఈయన తన 70వ పుట్టిన రోజు సందర్భంగా తన కంటే 29 యేళ్లు చిన్నది అయిన గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈ వివాహం 2016లో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
అంటే, కబీర్ బేడీకి ప్రస్తుతం 47 యేళ్ళ కుమార్తె పూజాబేడీ ఉంది. కానీ, ఈయన వివాహం చేసుకున్న గర్ల్ ఫ్రెండ్ వయసు 41 యేళ్లు. అంటే కుమార్తె కంటే ఆరేళ్లు చిన్నదన్నమాట. పైగా ఇది నాలుగో పెళ్లి. ఈమె పేరు ఫర్వీన్ డిసౌజా. బ్రిటీష్ నటి, ఓ మోడల్. ఈ పెళ్లి 2016 జనవరి 16వ తేదీన జరిగింది. ఈయన తొలిసారిగా 1969లో ప్రేమితా బేడీని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సుశాన్, ఆ పిమ్మట నిక్కీ బేడీని పెళ్లి చేసుకున్నాడు. కబీర్ బేడీ తొలి భార్యకు ఇద్దరు పిల్లలు. వారిలో కొడుకు సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమితా బేడీ ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.