శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (09:22 IST)

పడకగదిలో బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు.. తండ్రి గుండె ఆగిపోయింది.. అయినా పశ్చాత్తాపం లేదు

ప్రేమపై మోజుతో కన్నతండ్రి చనిపోయినా ఓ యువతి పట్టించుకోలేదు. కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రి తన వల్లే చనిపోయినా ఆ యువతిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. అర్థరాత్రి పూట బాయ్‌ఫ్రెండ్‌తో గదిలో వున్న క

ప్రేమపై మోజుతో కన్నతండ్రి చనిపోయినా ఓ యువతి పట్టించుకోలేదు. కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రి తన వల్లే చనిపోయినా ఆ యువతిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. అర్థరాత్రి పూట బాయ్‌ఫ్రెండ్‌తో గదిలో వున్న కన్నకూతురుని చూసి ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి షాక్ అయ్యాడు. కన్నకూతురితో వున్న వ్యక్తితో గొడవ పడ్డాడు. 
 
ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. అయితే బాయ్‌ఫ్రెండ్ తండ్రిని మెట్లపై తోసి దాడి చేసినా ఆ కూతురు మనస్సు బండరాయిలా నిలిచిపోయింది. చివరికి చికిత్స పొందుతూ ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడాలోని అట్టా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అట్టా గ్రామానికి చెందిన విశ్వనాథ్ సాహు (45) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూజ (21), భార్య గాయత్రితో కలిసి ఓ భవనంలోని మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉండే ధర్మేంద్ర (24)తో పూజకు ఏడాది కాలంగా పరిచయం ఉంది. 
 
ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కుమార్తె గదిలో ఏదో అలికిడి వినిపించడంతో విశ్వనాథ్ లేచి ఆమె గదిలోకి వెళ్లాడు. అక్కడ ధర్మేంద్ర కనిపించడంతో విస్తుపోయాడు. అతడితో గొడవపడ్డాడు. అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. ఈ క్రమంలో ఏర్పడిన ఘర్షణతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో విశ్వానాథ్ కిందికి వస్తూ పట్టు తప్పి మెట్లపై నుంచి జారి కిందపడ్డాడు.
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశ్వనాథ్ ప్రాణాలు కోల్పోయాడు. విశ్వనాథ్ భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. తండ్రి చనిపోయినా కుమార్తె పూజలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.