సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (15:19 IST)

ప్రేమకు అడ్డు చెప్పిందని.. పెంపుడు తల్లిని చంపేసిన బాలిక

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో దారుణం జరిగింది. అనాథ ఆశ్రమం నుంచి మూడు నెలల వయస్సున్నప్పుడు దత్తత తీసుకున్న కుమార్తే.. పెంపుడు తల్లిని పొట్టనబెట్టుకుంది. ఇందుకు కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు తెలిపార

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో దారుణం జరిగింది. అనాథ ఆశ్రమం నుంచి మూడు నెలల వయస్సున్నప్పుడు దత్తత తీసుకున్న కుమార్తే.. పెంపుడు తల్లిని పొట్టనబెట్టుకుంది. ఇందుకు కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల నుంచి ఆశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకున్న బాలికకు 12 ఏళ్లు వచ్చాయి. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న పెంపుడు తల్లిని ఆ బాలికే హతమార్చింది. 
 
12 ఏళ్ల వయసులోనే ఆ బాలిక ప్రేమలో పడిందని.. ఈ వయస్సులో ప్రేమ వద్దని హెచ్చరించిన పాపానికి ఆమెను చంపేసిందని పోలీసులు వెల్లడించారు. ప్రేమకు అడ్డుగా చెప్పిందని.. త‌ల్లిపై ఆగ్ర‌హం తెచ్చుకున్న ఆ బాలిక తన స్నేహితుడిని రాత్రి స‌మ‌యంలో ఇంటికి పిలిపించి, అతడితో కలిసి గొంతు నులిమి హతమార్చింది. అనంత‌రం త‌న‌ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, స్పృహ త‌ప్పి ప‌డిపోయింద‌ని అంద‌రినీ న‌మ్మించింది.
 
వైద్యులు కూడా ఆమె మరణించిందని నిర్ధారించారు. కానీ అంత్యక్రియలు జరిపే స‌మ‌యంలో మృత‌దేహం గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికుల‌కు అనుమానం క‌లిగింది. దీంతో పోలీసులు ఆ బాలిక‌ను విచారించ‌గా అస‌లు విష‌యాన్ని తెలిపింది. ఈ కేసులో మహిళను హతమార్చిన బాలిక, బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.