1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (12:42 IST)

అమృతకు బెదిరింపులు.. చెన్నై నుంచి బెంగళూరుకు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది అమృత. అయితే సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టులో ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాల్సిందిగా ఆదేశించింది. అమృత పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఈ నేపథ్యంలో అమృతకు బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో అమృత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. చెన్నైలో న్యాయవాదులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయిన అమృత.. ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియట్లేదట. 
 
అయితే అమృత త్వరలోనే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. జయలలిత కుమార్తెను తానేనని నిరూపించుకునేందుకు సిద్ధంగా వున్నానని.. అమ్మకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని.. సమగ్ర విచారణకు సైతం డిమాండ్ చేస్తూ అమృత కోర్టు మెట్లెక్కే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.