మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:10 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... ఆపై సూసైడ్ చేసుకున్నారు.. ఎందుకు?

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ దంపతుల జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం నడిబొడ్డున జరుగగా ఇది పెను సంచలనమైంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ దంపతుల జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం నడిబొడ్డున జరుగగా ఇది పెను సంచలనమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మాండ్యా జిల్లా కేఎం దొడ్డి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ (24) అనే యువకుడు బెంగళూరు నగరంలో ఏడేళ్ళుగా ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇక్కడు వచ్చిపోయే ప్రియ (19) అనే యువతి అతన్ని ప్రేమించింది. ఆ తర్వాత వారిద్దరూ పెద్దల అనుమతితో ఈనెల 2వ తేదీన వివాహం చేసుకున్నారు. 
 
పెళ్లి అనంతరం నవ దంపతులు అద్దె ఇంట్లో నివశిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నవ దంపతులు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 
 
పోలీసులు రంగంలోకి దిగి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అప్పుల కారణంగానే వీరిద్దరూ అత్మహత్య చేసుకుని ఉంటారని కుటుంబ సభ్యులు చెపుతున్నారు.