సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (17:52 IST)

మాల్దీవుల్లో కాజల్ హనీమూన్... ప్రైవేట్ రిసార్టులో భర్తతో ఎంజాయ్!

ఇటీవలే ఓ ఇంటికి కోడలైన తెలుగు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూతో వివాహమాడింది. అయితే, ఈ వివాహానికి ముందే అతనితో మూడేళ్ళ పాటు డేటింగ్ చేసింది. దీంతో వివాహం తర్వాత హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లలేదు. అయితే, మాల్దీవులకు ప్లాన్ చేసింది.
 
వివాహం తర్వాత ఎంతో బిజీగా ఉన్న కాజల్ దంపతులు... వారం రోజుల తర్వాత హనీమూన్ కోసం బయటికి వెళ్లిపోయారు. రెడీ టూ గో.. బ్యాగ్స్ ప్యాక్డ్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అభిమానులు కూడా హ్యాపీ జర్నీ అంటూ వాళ్లను సాగనంపారు.
 
ఇదిలావుంటే, ఇప్పుడు వాళ్ల హనీమూన్ ఫోటోలను కూడా షేర్ చేసింది. అవి చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. హనీమూన్‌కు వెళ్తున్నామని చెప్పిన కాజల్.. ఎక్కడికి అనేది మాత్రం దాచేసింది.
 
అయితే ఇప్పుడు ఫోటోలు పోస్ట్ చేయడంతో ఎక్కడికి వెళ్లారో క్లారిటీ వచ్చేసింది. మాల్దీవ్స్ సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌ను అద్దెకు తీసుకున్నారు కాజల్ జంట. అక్కడే కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేయనున్నారు ఈ జోడీ. భర్త గౌతమ్ కిచ్లుతో కొన్ని ఫోటోలను కాజల్ షేర్ చేసింది.