మెగాస్టార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రెడీ అంటున్న కొత్త పెళ్లికూతురు కాజల్ అగర్వాల్

kajal aggarwal
వి| Last Modified గురువారం, 5 నవంబరు 2020 (17:32 IST)
ఇప్పుడే కొత్తగా పెళ్లైన కాజల్ అగర్వాల్ కొద్ది రోజులు సినిమా రంగానికి విరామం ఇస్తుందంటే, అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తన స్నేహితులకు ఇక్కడే పార్టీ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు కొంత సమయం పడుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది మెగాస్టార్‌కు 152వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడెక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తోంది. తాజా మెగాస్టార్ పుట్టినరోజు ఆగస్టు 22 సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది 2021 సమ్మర్‌కి రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :