బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (13:14 IST)

నాగబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు తన పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ అత్యంత సన్నహితుడు, విధేయుడు, ఎమోషనల్ పర్సన్, మంచి హృదయుడు నా సోదరుడు నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
 
మన బంధం ఎప్పటిలాగా అనుబంధంగా ఉండాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నానని ట్వీట్ చేశారు. చిరు శుభాకాంక్షలకు నాగబాబు కూడా తనదైన శైలిలో రిప్లై ఇస్తూ థ్యాంక్స్ అన్నయ్యా అని తన అభిమానాన్ని తెలిపారు. మరోవైపు నాగబాబుకు సాయితేజ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు ట్వీట్ చేశారు.