బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:28 IST)

అన్నయ్యకు చెల్లెమ్మగా కీర్తి సురేష్.. రెకమండేషన్ ఎవరంటే?

అన్నయ్య మెగాస్టార్‌గా మహానటి కీర్తి సురేష్ నటించనుంది. మహానటి చిత్రంతో అద్భుతమైన నటిగా జాతీయ స్థాయిలో అవార్డుని దక్కించుకున్న కీర్తి సురేష్ త్వరలో మెగాస్టార్ సోదరిగా కనిపించనుంది. వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడు నెలలుగా ఈ మూవీ షూటింగ్‌ని నిలిపివేశారు.
 
త్వరలోనే ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి మరో తమిళ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అజిత్ హీరోగా శిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వేదాలం. మాస్ మసాల ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని చిరుతో మెహర్ రమేష్ రీమేక్ చేయబోతున్నాడు. తమిళంలో అజిత్‌కు సిస్టర్‌గా లక్ష్మీమీనన్ నటించింది. అదే పాత్ర కోసం తెలుగులో కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసినట్టు తెలిసింది.
 
నటనకు ఆస్కారం వున్న పాత్ర కావడంతో కీర్తి సురేష్‌ని చిరు రిఫర్ చేశారట. వెంటనే మెహెర్ అమెని కలిసి ఫైనల్ చేసినట్టు తెలిసింది. కీర్తిసురేష్ ప్రస్తుతం రంగ్‌దే, సర్కారు వారి పాట చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారు.