అమ్మాయిలు ఏ బ్రా వేసుకోవాలో వారికి తెలుసు : సంయుక్త దాడిపై కాజల్ కామెంట్స్
కర్నాటక రాజధాని బెంగుళూరులో కన్నడ నటి సంయుక్తా హెగ్డేపై పబ్లిక్ పార్కులో ఓ మహిళదాడికి దిగడం, ఆమెకు మరికొంతమంది మద్దతు తెలపడం జరిగింది. అయితే, ఈ దాడి ఘటనను అనేక మంది సెలెబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. అలాగే, ఇపుడు సినీ నటి కాజల్ అగర్వాల్ కూడా ఖండించారు. ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు.
'సామ్! ఇలా జరిగిందంటే నమ్మేలేకపోతున్నాను. కవితా రెడ్డి గారు మీ కోపానికి గల కారణం ఏంటో తెలుసుకొని పరిష్కరించుకోవాలి. మీ ఫ్రస్ట్రేషన్, కోపం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి. అన్నింటికి మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్ళకు తెలుసు. ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిది' అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, బెంగళూరులోని ఓ పార్క్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తన స్నేహితురాలితో వర్కౌట్లు చేస్తోన్న సంయుక్త హెగ్డేపై కవితా రెడ్డి అనే మహిళ దాడి చేయగా, దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. పబ్లిక్ ప్లేస్‌లలో ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతారా అంటూ కవితా రెడ్డి.. సంయుక్తతో పాటు ఆమె స్నేహితురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్నంతా రికార్డ్ చేసిన సంయుక్త తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ న్యాయం చేయాలని కోరింది.