'కలువ కళ్ళ సుందరి' పెళ్లి పీటలెక్కడం ఖాయమేనా?
టాలీవుడ్ చందమాన కాజల్ అగర్వాల్. ఈ చందమామకు త్వరలోనే పెళ్లి జరుగబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా, ఓ పారిశ్రామికవేత్తను ఈ అమ్మడు పెళ్లాడనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఈ అమ్మడు ఏమాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కడం ఖాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
'చందమామ' చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఈ బ్యూటీ పెళ్లివార్త ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ హీరోయిన్ రహస్యంగా గౌతమ్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కుటుంబాన్ని సన్నిహితుడట గౌతమ్. త్వరలోనే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నానని కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలావుంటే, పెళ్లి వార్తలపై మాత్రం కాజల్ నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తోంది. ఈ విషయమై హైదరాబాద్ నగరంలో ఉన్న కాజల్ మేనేజర్ సంప్రదించగా ఎలాంటి క్లూ దొరకలేదని టాక్ వినిపిస్తోంది. కలువ కళ్ల సుందరి కాజల్ పెళ్లి వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాజల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. అ.. కాజల్‌కు బెల్లంకొండ శ్రీనివాస్ విషెస్ కూడా చెప్పాడని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ జంట వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారని ఇన్‌సైడ్ టాక్. మరి ఈ పెళ్లి వార్తలపై కాజల్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
కాగా, గతంలో కాజల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తాను 2020లో సెటిలవ్వాలనుకుంటున్నట్టు చెప్పింది. అంతేకాదు తనకు కాబోయే భర్త సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని ఇప్పటికే చెప్పింది.