మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (21:25 IST)

నటి కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం రహస్యంగా జరిగిందా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అలాగే పెళ్లి చేసుకోవాల్సిన హీరోయిన్లలో ఆమె పేరు కూడా వుంది. పైగా తన చెల్లెలి పెళ్లి కావడంతో కాజల్ అగర్వాల్ పెళ్లెప్పుడు చేసుకుంటుందా అనే చర్చ అప్పట్నుంచే మొదలైంది. వీలున్నప్పుడలా అదిగో కాజల్ నిశ్చితార్థం అయిపోయిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ వుంటుంది. 
 
ఇప్పుడు మరోసారి ఇలాంటిదే మొదలైంది. కాజల్ అగర్వాల్ త్వరలో ఓ వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నదనీ, అతడు బెంగళూరుకు చెందిన బిలియనీర్ గౌతమ్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందట. వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యాడట.
 
ఐతే ఈ రూమర్లన్నీ వట్టి ట్రాష్ అని కొట్టిపడేసింది కాజల్ అగర్వాల్. తన పెళ్లి గురించి అంత గోప్యత తను పాటించననీ, అందరికీ చెప్పే  చేసుకుంటానని చెపుతోందట.