శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 ఆగస్టు 2020 (22:01 IST)

NiharikaEngagement, నీహారిక నిశ్చితార్థం

మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నీహారిక నిశ్చితార్థం ఈరోజు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షలో ఈరోజు జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తళుక్కున మెరిసింది. కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో బహు కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరిగింది.
వరుడు గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైత‌న్య జొన్నల‌గ‌డ్డ. ఇప్పటికే నీహారిక తన కాబోయే భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈరోజు నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్-ఉపాసనలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా నీహారిక వివాహం వచ్చే ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.