సుశాంత్ కేసు : రియాకు ఊరట - నగదు బదిలీకాలేదట

sushanth singh_Rhea
sushanth singh_Rhea
ఠాగూర్| Last Updated: గురువారం, 13 ఆగస్టు 2020 (17:29 IST)
బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే. దీనిపై సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అయితే, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి అతని ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి పెద్ద మొత్తంలో న‌గ‌దు త‌న ఖాతాలోకి మ‌ళ్లించుకుంద‌ని ఆరోప‌ణ‌లు, వార్త‌లు వ‌చ్చాయి.

దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు కూపీలాగారు. ఏకంగా 18 గంటలకు పైగాఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తిని విచారించారు. ద‌ర్యాప్తులో రియా ఆస్తుల‌కు సంబంధించిన అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించిద‌ట‌.

అంతేకాదు త‌న లైఫ్‌స్టైల్ గురించి కొన్ని విష‌యాలు చెప్పింద‌ట‌. సుశాంత్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి జాయింట్ అకౌంట్ హోల్డ‌ర్‌గా లేద‌ని ఈడీ అధికారులు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు సుశాంత్ ఖాతా నుంచి రియా అకౌంట్‌కు కానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల ఖాతాకు కానీ బదిలీ కాలేద‌ని ఈడీ నిర్దారించిన‌ట్టు టాక్‌. ఈడీ అధికారులు నిర్దార‌ణ‌తో రియా చ‌క్ర‌వ‌ర్తికి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టేనంటున్నారు నెటిజ‌న్లు.దీనిపై మరింత చదవండి :