శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (09:52 IST)

చందమామ చేతికి మెహందీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో

Kajal Agarwal
టాలీవుడ్ అందాల చందమామ అక్టోబర్ 30న తన చిన్నానాటి స్నేహితుడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే కాజల్ పెళ్ళి పనులన్నీ పూర్తి కాగా, ఈ రోజు సంగీత్ వేడుక జరగనున్నట్టు తెలుస్తుంది. బుధవారం రోజు జరిగిన మెహందీ వేడుకలో దిగిన ఫోటోని కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో తన చేతికి పెట్టుకున్న మెహందీని చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తుంది.
 
కాజల్ మెహందీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఈ ఫోటోకి పెళ్ళి కల వచ్చేసిందే బాల అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కాజల్ వివాహం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరగనుంది. ఇండస్ట్రీకి సంబంధించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
 
ఇకపోతే.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ నెల 30వ తేదీన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. 
 
ఈ ఫోటోలో.. గౌతమ్ తనకు కాబోయే భార్యను దగ్గరికి తీసుకోగా... కాజల్ అతడి భుజాలపై ఆనుకుని సంతోషంలో మునిగితేలుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి... ‘చూడముచ్చటైన జంట’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తాజాగా కాజల్ మెహందీ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.