''జెస్సీ'' హీరోయిన్ దమ్ము కొట్టిందా..? బాలయ్య డైలాగ్ చెప్తూ సిగరెట్ కాల్చుతూ..? (video)
''జెస్సీ'' చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న అషిమా నర్వాల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. నాటకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె జెస్సీతో గుర్తింపు సంపాదించారు. కానీ ఆపై ఆమెకు తెలుగులో ఆఫర్లు అంతంత మాత్రంగానే వున్నాయి.
అయితే ఈ అమ్మడు తర్వాత తమిళ సినిమాలు చేస్తూ బిజీగా మారారు. అయితే ఇప్పుడు కొత్తగా నటిస్తున్న ఓ చిత్రంలో తన పాత్ర కోసం దమ్ము కొట్టడం నేర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్స్ యూ, ఐయామ్ నాట్ ద ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్" అని ఆవేశంతో చెప్పాల్సిన బాలయ్య డైలాగ్‌ను కూల్‌గా సిగరెట్ తాగుతూ చెప్పారు.
కొసమెరుపు ఏంటంటే సిగరెట్ తాగడం హానికరమని క్యాప్షన్ ద్వారా హెచ్చరిక జారీ చేశారు. అయితే తన కొత్త సినిమా కోసమే సిగరెట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ వీధుల్లో షికార్లు కొట్టడం కూడా ప్రమాదమేనని పేర్కొన్నారు.
ఇక మనమందరం భూమిని ఇబ్బందిపెడుతున్నామని, అందుకే భూమాత మనల్ని తిరిగి ఇబ్బంది పెడుతోందని, నిజానికి భూమి అసలు సమస్య కాదని, అదే అసలు సిసలైన నిజమని బాలయ్య డైలాగ్ తరహాలో చెప్పారు. అయితే ఇది హైదరాబాద్ వరదల గురించే పరోక్షంగా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.