శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (17:32 IST)

వార్నీ తస్సారావుల బొడ్డు.. వీపును ఇలా కూడా గోకించుకుంటారా?

సోషల్ మీడియా పుణ్యమాని ఆసక్తికరంగా ఉండే పని ఏది చేసినా అది వైరల్ అయిపోతోంది. తాజాగా ఓ వ్యక్తి తన వీపును జేసీబీతో గోకించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు... వీపును ఇలా కూడా గోకించుకుంటారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. 
 
ఇంతకీ ఆశ్చర్యకర సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. సాధారణంగా చిన్నచిన్న భవనాలను కూల్చేందుకు లేదా మట్టిని తవ్వేందుకు జేసీబీ యంత్రాన్ని వినియోగిస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం వీపును గోకేందుకు వాడుకున్నాడు. 
 
ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 41 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో ఓ వ్యక్తి టవల్‌తో వీపును గోక్కుంటూ.. అక్కడనే ఉన్న జేసీబీ దగ్గరకు వెళ్లాడు. కిందకు వంగగా డ్రైవర్ జేసీబీని కిందకి దించి అతని వీపుపై పెట్టి కింది నుంచి పైకి వెళ్లే విధంగా చేశాడు.
 
మూడు రోజుల క్రితం ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, రెండు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే, 2300 మంది ఈ వీడియోను షేర్ చేయగా, వెయ్యి మందికి పైగా కామెంట్స్ చేశారు. 
 
అయితే, ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. నవ్వించేందుకే ఈ వీడియో తీశారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడగా, అలా చేయడం ప్రమాదకరమని, మరోసారి ఇలా ఎవరూ చెయ్యెద్దని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో  ఉన్నవారు ఎక్కడివారు, ఎప్పుడు జరిగిందనే విషయాలు వెల్లడి కాలేదు.