శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (20:12 IST)

సామాజిక సేవలో కాజల్ అగర్వాల్... షార్ట్ ఫిలిమ్ వీడియో చూడండి..

టాలీవుడ్ అగ్ర నటి, దక్షిణాది చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ షార్ట్ ఫిలిమ్‌లో నటించింది. దక్షిణాది, ఉత్తరాదిన కొన్ని సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సామాజిక సేవకు నడుంబిగించారు. రక్తదానంపై అవగాహన

టాలీవుడ్ అగ్ర నటి, దక్షిణాది చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ షార్ట్ ఫిలిమ్‌లో నటించింది. దక్షిణాది, ఉత్తరాదిన కొన్ని సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సామాజిక సేవకు నడుంబిగించారు. రక్తదానంపై అవగాహన కలిగించేందుకు ఆమె ఓ షార్ట్ ఫిలిమ్‌ నటించారు. 
 
కాజల్ అగర్వాల్ నటించిన షార్ట్ ఫిల్మ్ సోమవారం విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కాబోయే వరుడిని ఎన్నుకునే క్రమంలో సాగే ఈ షార్ట్ మూవీకి శత్రుఘ్న సిన్హా దర్శకత్వం వహించారు. తాజాగా కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాలో బాహుబలి భల్లాలదేవ రానాతో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడు చీరకట్టులో అదరగొట్టింది. గ్లామర్ పంట పండించింది. 
 
తమిళంలో అజిత్ సరసన వివేగం సినిమాలో కనిపించింది. ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు చేతిలో వున్న ఆఫర్లను చేసుకుంటూ మంచి అవకాశాల కోసం చందమామ ఎదురుచూస్తోంది.