మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (08:35 IST)

అమ్మ కాజల్.. సమంత ప్లేస్ కొట్టేయాలనే. 50 సినిమాలు నటించినా ఇంకా యావే..!

కళ్లతో మాయ చేసి బురిడీలు కొట్టించే కాజల్ అగర్వాల్ పదేళ్ల చిత్రసీమ లైఫ్‌లో 50 సినిమాలు పూర్తి చేయడమే కాకుండా ఇప్పటికీ తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమల్లో అవకాశాలను బాగానే అందుకుంటోంది. కోలీవుడ్‌లో టాప్‌ హీరోలు విజయ్, అజిత్‌లతో ఏకకాలంలో నటిస్తున్న అరుదైన

కళ్లతో మాయ చేసి బురిడీలు కొట్టించే కాజల్ అగర్వాల్ పదేళ్ల చిత్రసీమ లైఫ్‌లో 50 సినిమాలు పూర్తి చేయడమే కాకుండా ఇప్పటికీ తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమల్లో అవకాశాలను బాగానే అందుకుంటోంది. కోలీవుడ్‌లో టాప్‌ హీరోలు విజయ్, అజిత్‌లతో ఏకకాలంలో నటిస్తున్న అరుదైన క్రెడిట్‌ను కొట్టేసిన నటి కాజల్‌ అగర్వాల్‌.
 
అజిత్‌తో రొమాన్స్‌ చేసిన వివేగం చిత్రం ఆగస్ట్‌ నెల రెండవ వారంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆయనతో నటించిన తొలి చిత్రం కావడంతో చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తోంది. అదే విధంగా తెలుగులో తనకు తొలి అవకాశం కల్పించిన దర్శకుడు తేజ దర్శకత్వంలో తాజాగా నటించిన తెలుగు చిత్రం నేనే రాజా నేనేమంత్రి తమిళంలోనూ నాన్‌ ఆణైయిట్టాళ్‌ పేరుతో విడుదలకు సిద్ధం అవుతోంది. వీటితో పాటు, హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంది. 
 
ఈ ఏడాది తనకు చాలా స్పెషల్‌ అంటున్న కాజల్‌ అగర్వాల్‌ కొత్తగా ఒక టార్గెట్‌ పెట్టుకుందని తెలుస్తోంది. నటి సమంత అంగీకరించిన చిత్రాలను చకచకా పూర్తి చేసి ప్రియుడు నాగచైతన్యతో మూడుముళ్లకు సిద్ధం అవుతుండడంతో ఆమె కోసం ఎదురుచూస్తున్న అవకాశాలను రాబట్టుకునే ప్రయత్నంలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో విజయ్, అజిత్, సూర్య, కార్తీ, ధనుష్‌ అంటూ ప్రముఖ కథానాయకులందరితోనూ నటించేసింది. ఇప్పుడు ఈ అమ్మడి చూపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై పడిందట.ఆయనతో నటించడమే టార్గెట్‌గా పెట్టుకుందట. త్వరలోనే అలాంటి అవకాశం వస్తుందనే ఆశలపల్లకిలో కలలు కంటోందట.
 
పెళ్లయ్యాక కూడా తాను నటిస్తూనే ఉంటానని సమంత చెబుతుండగా, పెళ్లి తర్వాత సమంత ఫేడవుట్ అయిపోతే ఆమె స్థానంలోకి, ఆమె అవకాశాల్లోకి దూరిపోవాలని చూస్తున్న కాజల్‌ది షార్ప్ బ్రెయినే మరి.