మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 జులై 2017 (04:51 IST)

చుట్టూ చెంగావి చీర.. కట్టావే చిలకమ్మా.. చీరకట్టులో నిండుగా కాజల్

చీరకట్టు భారతీయ సంప్రదాయానికి తొలి మెట్టు అన్నారు పెద్దలు. అంతేనా... చీరకట్టులో ఓ అందం, హుందాతనం ఉన్నాయి. అందుకే, సగటు భారతీయ మహిళలా కాజల్‌ అగర్వాల్‌ కూడా చీరకు ఓటేశారు. తేజ దర్శకత్వంలో రానాకు జోడీగా కాజల్‌ నటించిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. ఇంద

చీరకట్టు భారతీయ సంప్రదాయానికి తొలి మెట్టు అన్నారు పెద్దలు. అంతేనా... చీరకట్టులో ఓ అందం, హుందాతనం ఉన్నాయి. అందుకే, సగటు భారతీయ మహిళలా కాజల్‌ అగర్వాల్‌ కూడా చీరకు ఓటేశారు. తేజ దర్శకత్వంలో రానాకు జోడీగా కాజల్‌ నటించిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. ఇందులో టైటిల్స్‌ నుంచి ఎండ్‌ కార్డ్స్‌ వరకు మ్యాగ్జిమమ్‌ కాజల్‌ చీరల్లోనే కనిపిస్తారట! గతంలో పలు సినిమాల్లో కాజల్‌ చీరకట్టులో కనిపించారు. అయితే... కంప్లీట్‌గా శారీస్‌లో కనిపించిన సినిమా ఏదీ లేదు. పైగా, ఆయా సినిమాల్లో ట్రెండీ, స్టైలిష్‌ శారీస్‌లో సందడి చేశారు. 
 
ఇప్పుడీ ‘నేనే రాజు నేనే మంత్రి’లో కంచిపట్టు, చేనేత చీరల్లో హుందాతనానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్టు కనిపిస్తారట! ఈ సినిమాకు ఇదో స్పెషల్‌ అయితే... కాజల్‌కు 50వ సినిమా కావడం మరో స్పెషల్‌. తేజ ‘లక్ష్మీ కల్యాణం’తో హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత కాజల్‌ మళ్లీ పదేళ్ల తర్వాత తేజ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సిన్మాను డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించారు.