శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (13:28 IST)

'మీ నగ్నత్వాన్ని ప్రేమించండి' అంటూ బాలీవుడ్ డైరెక్టర్ ఎక్స్-వైఫ్ న్యూడ్ పిక్చర్

మీ నగ్నత్వాన్ని ప్రేమించండి అంటూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఓ న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో ఈ ఫోటోను ఆమె ప

మీ నగ్నత్వాన్ని ప్రేమించండి అంటూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఓ న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో ఈ ఫోటోను ఆమె పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా, దీనిపై బాలీవుడ్‌లో పెద్ద చర్చే సాగుతోంది.
 
హాలీవుడ్ నటీమణులు నగ్నత్వాన్ని ప్రేమించాలని చెబుతూ అప్పుడప్పుడు తమ నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేస్తుంటారు. వారి బాటలో నడిచిన కల్కి కొచ్లిన్ తన ఒంటిపై నూలు పోగు లేకుండా, అసభ్యత కనిపించకుండా జాగ్రత్తగా దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది. 
 
దానికి 'మీ నగ్నత్వాన్ని ప్రేమించండి' అంటూ వ్యాఖ్యను కూడా జోడించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, హాలీవుడ్ సంస్కృతిని కల్కి బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు ఉవ్విళ్లూరుతోందని పలువురు పేర్కొంటున్నారు. పాండిచ్చేరికి చెందిన ఫ్రెంచ్ మూలాలు కలిగిన కల్కి కొచ్లిన్... "దేవ్ డి" సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. అనంతరం ఆ సినిమా దర్శకుడు అనురాగ్ కశ్మప్‌ను వివాహం చేసుకుని, 2015లో విడిపోయింది. ఇపుడు ఖాళీగా ఉంటున్న కల్కి.. ఈ తరహా పోస్ట్‌ల ద్వారా నిత్యం మీడియా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు.