శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:10 IST)

చంపేస్తామని బెదిరిస్తున్నారు... అయినా బెదిరిపోను : కమల్ హాసన్

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయనకు హత్యా బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరింపులు వస్తున్నాయని, అయితే వాటికి బెదిరిపోయ

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయనకు హత్యా బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరింపులు వస్తున్నాయని, అయితే వాటికి బెదిరిపోయే వ్యక్తిని కానని ఆయన ప్రకటించారు. 
 
ఆయన తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.... దేశంలో మార్పు అవసరమ‌ని ఆ మార్పు త‌న‌తోనే, తమిళనాడు నుంచే రావాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇందుకోసం తాను కొత్త పార్టీ పెట్టే తీరుతానని, ఇతర ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు. 
 
త‌న‌ జీవితంలో చాలా మంది రాజకీయ పార్టీల నేతలను కలుసుకున్నాన‌ని, వారితో ఫొటోలు దిగానని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాను ఏ పార్టీ సిద్ధాంతాలకు లోబడలేద‌న్నారు. త‌న‌ ఆశయాలు, ఆలోచనలకు అనువుగా ఏ ఒక్క‌ పార్టీ ఉన్నట్లుగా త‌న‌కు అనిపించ‌లేద‌ని చెప్పారు. శశికళను తొలగించడం, అన్నాడీఎంకే పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అన్నారు.