కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. గదిలో మెల్లగా నడుస్తున్నారు.. నొప్పి తగ్గిందట..!
ఇటీవల కమల్ తన స్వగృహంలో మేడ మీద నుంచి కిందకు వస్తుండగా మెట్లపైనుంచి జారిపడ్డారు. దాంతో ఆయన కుడికాలు విరిగింది. దాంతో చెన్నై మౌంటురోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపర
ఇటీవల కమల్ తన స్వగృహంలో మేడ మీద నుంచి కిందకు వస్తుండగా మెట్లపైనుంచి జారిపడ్డారు. దాంతో ఆయన కుడికాలు విరిగింది. దాంతో చెన్నై మౌంటురోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ చేసిన కాలు మళ్లీ నొప్పి పుడుతుండటంతో వైద్యులు గత ఆదివారం మరోసారి ఆపరేషన్ చేశారు. ఎట్టకేలకు కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
23 రోజుల పాటు చికిత్స కోసం ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన కోలుకోవడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. ఇప్పుడు తాను బాగానే నడవ గలుతున్నానని కమల్ హాసన్ అభిమానులకు ట్వీట్ చేశారు. ఆస్పత్రి గదిలోనే మెల్లగా నడుస్తున్నానని, నొప్పి తగ్గిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.