శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 8 జులై 2017 (09:36 IST)

కెప్టెన్ కావాలనుకున్నా.. హీరోయిన్ అయిపోయిన అక్షర

విలక్షణ తమిళ నటుడు కమల్ హసన్ రెండో కుమార్తె అక్షర హసన కూడా తండ్రిబాటలో నడుస్తున్నారు. తన అక్క శ్రుతిహసన్ మాదిరే ఏదో కాబోయి మరేదో ఆయినట్లుగా చెల్లెలు కూడా ఇప్పుడు అక్కలాగే హీరోయిన్ అయిపోయారు.

విలక్షణ తమిళ నటుడు కమల్ హసన్ రెండో కుమార్తె అక్షర హసన కూడా తండ్రిబాటలో నడుస్తున్నారు. తన అక్క శ్రుతిహసన్ మాదిరే ఏదో కాబోయి మరేదో ఆయినట్లుగా చెల్లెలు కూడా ఇప్పుడు అక్కలాగే హీరోయిన్ అయిపోయారు. సంగీతంపై మక్కువ కలిగిన శ్రుతిహసన్ సంగీతరంగంలో రాణించాలని ఆశపడి పలుప్రైవేట్ సంగీత ఆల్బమ్‌లు చేశారు. పైగా తన తండ్రి కమలహాసన్‌ నటించిన ఉన్నైపోల్‌ ఒరువన్‌ చిత్రం ద్వారా సంగీతదర్శకురాలిగా రంగప్రవేశం చేశారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా హీరోయిన్‌గా అవతారమెత్తారు.
 
తమిళసినిమా నటుడు కమలహాసన్‌ రెండో వారసురాలు అక్షరహాసన్‌ ఎట్టకేలకు హీరోయిన్‌ అవుతున్నారు. తన అక్క శ్రుతీహాసన్‌ మాదిరిగానే వృత్తిపరంగా వారు కోరుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయ్యింది. శ్రుతీహాసన్‌కు సంగీతంపై మక్కువ అన్నది తెలిసిందే. తను సంగీత రంగంలో రాణించాలని ఆశ పడ్డారు.
 
అదేవిధంగా పలు ప్రైవేట్‌ సంగీత ఆల్బంలు చేసిన శ్రుతి తన తండ్రి కమలహాసన్‌ నటించిన ఉన్నైపోల్‌ ఒరువన్‌ చిత్రం ద్వారా సంగీతదర్శకురాలిగా రంగప్రవేశం చేశారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా హీరోయిన్‌గా అవతారమెత్తారు. హిందీలో లక్‌ చిత్రంతో తన లక్కును పరిక్షించుకున్నా, తెలుగు చిత్రం గబ్బర్‌సింగ్‌తోనే స్టార్‌డమ్‌ను పొందగలిగారు. 
 
ఇక అక్షరహాసన్‌ కెమెరా వెనుక కెప్టెన్‌ కావాలని ఆశించారు. అందుకు దర్శకుడు బాల్కీ వద్ద సహాయదర్శకురాలిగా పనిచేశారు కూడా. అయితే తను యాదృచ్ఛికంగానే హిందీ చిత్రం షమితాబ్‌ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. తాజాగా అజిత్‌ హీరోగా నటిస్తున్న వివేగం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ అక్షరహాసన్‌ కథానాయకి కాదు. 
 
తాజాగా హీరోయిన్‌ అవకాశం ఈమెను వరించిందని సమాచారం. అయితే ఈ అవకాశం అక్షరకు శాండిల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్‌ వారసుడు విక్రమ్‌ చంద్రన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షర ఆయనకు జంటగా నటించనున్నారని  సమాచారం.