ప్రభాస్‌తో గొడవ మాటల్లేవ్.. బాహుబలి చూసి షాకయ్యా.. హ్యాపీగా ఫీలయ్యా: కంగనా రనౌత్
బాలీవుడ్ రింగు జుట్టుల సుందరి కంగనా రనౌత్ నటించిన రంగూన్ సినిమా ఈ నెల 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది కంగన
బాలీవుడ్ రింగు జుట్టుల సుందరి కంగనా రనౌత్ నటించిన రంగూన్ సినిమా ఈ నెల 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది కంగనా రనౌత్. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కంగనా రనౌత్.. మీడియాతో టాలీవుడ్ ప్రేక్షకులకు తనకున్న సంబంధాలను పంచుకుంది.
బాహుబలి-2 ప్రభాస్‌తో తాను గతంలో పడిన గొడవ గురించి చెప్పింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘ఏక్‌నిరంజన్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి కంగనా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా చేసే సమయంలో ప్రభాస్‌కు, తనకు మధ్య పెద్ద గొడవైందని చెప్పింది. దీంతో తమ ఇద్దరి మధ్య మాటల్లేకుండా పోయాయని, అప్పటి నుంచి అతనితో తాను టచ్‌లో లేనని వెల్లడించింది.
అయితే బాహుబలి సినిమా చూసి షాక్ అ్యయానని.. అందులో ప్రభాస్ విన్యాసాలు చూసి ఖంగుతిన్నానని చెప్పింది. బాహుబలిలో ప్రభాస్ యాక్షన్ చూసి ఎంతో హ్యాపీగా ఫీలయ్యానని చెప్పింది. ప్రస్తుతం తన కెరీర్ చూసి ప్రభాస్ కూడా గర్వపడుతుంటాడేమోనని తెలిపింది.