గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (16:05 IST)

ముస్లిం ఫ్రెండ్స్ పంది మాంసం తింటారు.. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నారు.. కంగనా

kangana
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వార్తలకెక్కారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార మాజీ ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెను ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇదే అశంపై ఆమె ట్వీట్ చేశారు. 
 
"నాకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. వారు మద్యం సేవిస్తారు. ధూమపానం చేస్తారు. వారిలో అనేక మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నవారు ఉన్నారు. వారు బురాఖాలు ధరించరు. బూతులు మాట్లాడతారు. పందిమాంసం తింటారు. 
 
వాళ్లు అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌదర్యం ఇదే. నపూర్ శర్మ ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేయడం కాదు. ప్రతి ఒక్కరూ క్రిమినల్‌గా మారుతున్నాం" అని చెప్పారు.