ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (16:08 IST)

కన్నడ నిర్మాత అనేకల్ బాలరాజ్ దుర్మరణం

anekal balaraj
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత అనేకల్ బాలరాజ్ (58) దుర్మరణం పాలయ్యారు. బెంగుళూరు, జేపీ నగరంలో తన నివాసం వద్ద ఆదివారం ఉదయం బాలరాజ్ వాకింగ్ చేసేందుకు వెళ్లాడు. అపుడు తన కారును రోడ్డుపక్కన ఆపి, రోడ్డు దాటుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. ఆయన ఆరు కన్నడ చిత్రాలను నిర్మించారు. 2009లో వచ్చిన కెంప చిత్రంలో ప్రధాన పాత్రను కూడా పోషించారు.