బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (11:29 IST)

మద్యం మత్తులో నీళ్లు అనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి మృతి

acid
పీకల వరకు మద్యం సేవించిన ఓ తాగుబాతు నీళ్లు అనుకుని యాసిడ్ సేవించి ప్రాణాలు తీసుకున్నాడు. ఈయన గత 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా మల్కల్ల గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హజీపూర్ మల్కల్ల గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే సింగరేణి కంపెనీలో పని చేస్తున్నాడు. మద్యాగానికి బానిస అయిన మహేష్ గత నెల 18వ తేదీన మంచినీరు అనుకుని యాసిడ్ తాగాడు. 
 
దీంతో అపస్మారకస్థితిలోకి జారుకోగా అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన  మహేష్... ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై హజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.