ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (15:49 IST)

మాటలు తగ్గించి పని చేయండంటున్న 'కారందోశ'

నేటి యువత మాటల్తో కాలాన్ని గడపటం కాదు.. చేతల్తో ముందుకు వెళ్ళాలి.. ఇదే నా సినిమాలో చెప్పిందని.. 'కారందోశ' చిత్రం గురించి దర్శక నిర్మాత టి. త్రివిక్రమ్‌ అంటున్నారు. 'కారందోశ' చిత్రం మంగళవారం సెన్సార్‌

నేటి యువత మాటల్తో కాలాన్ని గడపటం కాదు.. చేతల్తో ముందుకు వెళ్ళాలి.. ఇదే నా సినిమాలో చెప్పిందని.. 'కారందోశ' చిత్రం గురించి దర్శక నిర్మాత టి. త్రివిక్రమ్‌ అంటున్నారు. 'కారందోశ' చిత్రం మంగళవారం సెన్సార్‌ పూర్తయిందని ఈనెల 30న సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పాడు. 
 
అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఆయన.. తన స్నేహితులతో కలిసి సినిమాను తీశాడు. నేటివ్‌ ప్లేస్‌ కడపలో చిత్రాన్ని పూర్తిచేశాడు. వీణా వేదిక అనే బేనర్‌ను స్థాపించి తొలిసారిగా సినిమా తీశానని.. ఇప్పటి యూత్‌కు తగినట్లు సినిమా వుంటుందని చెబుతున్నాడు.  
 
కాగా, ఈ చిత్రం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ఆర్మీ ఫండ్‌కు ఇస్తానని ప్రకటించి.. ఇప్పటికే లక్షరూపాలు అందజేశానని.. ఇంకా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని త్రివిక్రమ్‌ తెలిపారు. చందన, శివ, సూరి శ్రీనివాస్‌ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.