బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (15:45 IST)

ఖైదీగా సీక్వెల్ వచ్చేస్తోంది, మళ్లీ అందర్నీ మెప్పిస్తానంటున్న హీరో

యుగానికొక్కడు, ఆ తర్వాత ఆవారా సినిమాలతో తమిళ హీరో కార్తీ తెలుగునాట మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలతో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ మధ్యలో వేగం తగ్గిందనే చెప్పాలి. చివరిగా వచ్చిన చినబాబు, దేవ్ చిత్రాలు ఆశించిన మేరకు హిట్ కొట్టలేకపోయాయి. తాజాగా విభిన్న కథాంశంతో ప్రయోగం చేస్తూ తీసిన ఖైదీ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో కార్తీ ఆనందంలో మునిగిపోయాడు.
 
ఈ సినిమాతో పాటుగా తమిళ హీరో విజయ్ నటించిన బిగిల్ సినిమా కూడా రిలీజైంది. ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో రిలీజైంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రెండు డబ్బింగ్ సినిమాల కోసం భారీ సంఖ్యలో తెలుగునాట థియేటర్లను కేటాయించారు. పెద్ద సినిమాలేవీ లేకపోవడం దీనికి కారణం. మొదటి రోజున ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లను సాధించినప్పటికీ క్రమంగా విజయ్ నటించిన విజిల్ కంటే ఖైదీ ఎక్కువ ఎక్కువ వసూళ్లను సాధించిది.
 
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఖైదీ సినిమాను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్స్... నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకులలో నా వెన్నంటి ఉన్న సోదర సోదరీమణులందరూ గర్వపడేలా నేను కష్టపడి పని చేస్తూనే ఉంటాను.. మీ కోసం ఢిల్లీ మళ్లీ వస్తాడు అంటూ సీక్వెల్‌ను ప్రకటించేసాడు.