యు.ఎస్.ఎ.లో కార్తికేయ-2 యాభైరోజుల వేడుకలు
TG Vishwa Prasad with usa team
నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 USAలో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
TG Vishwa Prasad with usa team
ఇటీవలే ఈ చిత్రం విజయవంతంగా 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది. ఓవర్సీస్ లో రెడ్ హార్ట్ మూవీస్ కార్తికేయ-2 చిత్రాన్ని రిలీజ్ చేసారు. మునెపెన్నడూ లేని విధంగా మొదటిసారి యునైటెడ్ స్టేట్స్‌లో 50 రోజుల వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ హాజరై సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్తికేయ 2' చిత్రం అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మూవీ టీంకి ఇప్పటికి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని TG విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. కార్తికేయ 2 లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది.
ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా అద్భుతమైన విజయం సాధించి ఇప్పటికి కొనసాగుతుంది.అనుపమ్ ఖేర్ కృష్ణతత్వాన్ని చెప్పే సీన్ ఈ సినిమాకి మేజర్ హైలెట్. ఈ చిత్రానికి కాల భైరవ సంగీత దర్శకుడు.