గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 17 మార్చి 2017 (18:47 IST)

కాటమరాయుడు క్రేజ్, టి-షర్టులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ మార్చి 24న విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ సంస్థ , అభిమానులను ఆనందపరచటానికి ఓ కొత్త ఆలోచనతో వస్తున్నారు. ఎఖోరా అనే సంస్థను అఫీషియల్ మర్చండైస్‌గా నియమిస్తూ, వారితో ఆనుసంధానమై, కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ మార్చి 24న విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ సంస్థ , అభిమానులను ఆనందపరచటానికి ఓ కొత్త ఆలోచనతో వస్తున్నారు. ఎఖోరా అనే సంస్థను అఫీషియల్ మర్చండైస్‌గా నియమిస్తూ, వారితో ఆనుసంధానమై, కాటమరాయుడు T - Shirts మరియు పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వాడిన పచ్చ రంగు టవల్స్‌ను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నారు.
 
అలాగే నేరుగా ఎఖోరా డీలర్ల వద్ద ,తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో కాటమారాయుడు విడుదలయ్యే కేంద్రాల్లో లభ్యమవుతాయని  చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేసింది. అభిమానులను దృష్టిలో పెట్టుకొని వారికి అందుబాటు ధరకు ఇవి లభ్యమౌతున్నాయి. ఆన్ లైన్లో పైవాటిని కొనదలచిన వారు katamarayudustore.com వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేస్కోవచ్చు. రెండ్రోజుల క్రిందట ఇవి మార్కెట్లో విడుదలై పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.