టైగర్ 3 చిత్రంలో పాటలో 7 లుక్స్‌తో మెస్మరైజ్ చేయనున్న కత్రినా కైఫ్
బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ టైగర్ 3లో ఆమె జోయా అనే పాత్రలో కత్రినా కైఫ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు..కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న లేకే ప్రభు కా నామ్.. పాట ఓ ఉదాహరణగా నిలవనుంది. ఈ పాట రిలీజ్ తర్వాత ఇంటర్నెట్ నెక్ట్స్ రేంజ్‌లో వైరల్ అవుతుంది.
టైగర్ 3 చిత్రంలో లేకే ప్రభు కా నామ్.. పాటలో కత్రినా కైఫ్ ఏకంగా ఒకట్రెండు కాదు.. 7 అద్భుతమైన లుక్స్‌తో అలరించబోతున్నారు. ఆమె ఎంటైర్ కెరీర్‌లో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరేట్ సాంగ్ లేకే ప్రభు కా నామ్. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ లేకే ప్రభు కా నామ్ విజువల్‌గా ప్రేక్షకులను అలా కట్టిపడేస్తుంది. అందుకనే నా ఫేవరేట్ సాంగ్స్‌లో ఇదొకటి. టర్కీలోని కాప్పడోసియా ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు. మాషాల్లా, స్వాగ్ సే స్వాగత్ పాటల తర్వాత నా ఫేవరేట్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్‌తో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాటలో నన్ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ పాటలో నన్ను ఆమె ఏకంగా ఏడు మెస్మరైజింగ్ లుక్స్‌లో చూపించారు. దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. టైగర్ ఫ్రాంచైజీ నుంచి వచ్చే పాట ఎప్పుడూ చార్ట్ బస్టర్‌గా నిలుస్తుంది. అదే కోవలో లేకే ప్రభు కా నామ్ పాటను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. వైభవి పాటను చిత్రీకరించిన తీరు.. టైగర్, జోయా మధ్య ఉండే కెమిస్ట్రీ సరికొత్తగా అలరించనుంది. సల్మాన్ ఖాన్‌గారితో కలిసి డాన్స్ చేయటాన్ని ఎ్పుడు ఎంజాయ్ చేస్తాను. లేకే ప్రభు కా నామ్ పాట చిత్రీకరణలో మరచిపోలేని అనుభూతులెన్నో ఉన్నాయి అన్నారు.
శుక్రవారం లేకే ప్రభు కా నామ్ పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. క్షణాల్లోనే అది నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఫుట్ ట్యాపింగ్ డాన్స్ ట్రాక్ .. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు అలా కళ్లు అప్పగించి చూసేలా చేయనుంది. ఈ పాటను ప్రీతమ్ కంపోజ్ చేయగా బెన్నీ దయాల్, అనుషా మణి పాడారు. ఈ పార్టీ సాంగ్ ఈ సీజన్‌లో అందరికీ ఫేవరేట్ సాంగ్‌గా నిలవనుంది.
వెండితెరపై ప్రేక్షకులను మెప్పించే జోడీల్లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఎప్పుడూ ముందుంటుంది. వారిద్దరి కాంబినేషన్‌లో హిస్టారిక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాగే తిరుగులేని చార్ట్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆదిత్య చోప్రా టైగర్ 3లో టైగర్ , జోయా పాత్రల్లో మెప్పించటానికి సిద్ధమయ్యారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన టైగర్ 3 చిత్రాన్ని మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.