నానికి హీరోయిన్‌గా కీర్తి సురేష్.. అవికా గోర్‌ను వద్దని శైలజను తీసుకున్నారు!
దర్శకుడు త్రినాథరావు నాని హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో నేను.. శైలజ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. బెక్కం వేణుగోపాల్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలిసింది. గత కొంత కాలంగా హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న ఈ చిత్రబృందం ఆ పాత్రకు కీర్తి అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేశారని తెలిసింది.
‘సినిమా చూపిస్తా మావ’ సినిమాకి మాటలు, పాటలు రాసిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకీ రచయితగా పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే కీర్తి ప్రస్తుతం తమిళంలో ధనుష్, విజయ్ వంటి అగ్రహీరోల సరసన నటిస్తూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ముందుగా అవికా గోర్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటింపజేయాలని అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ అయితే క్యారెక్టర్ పరంగా బాగుంటుందని సినీ యూనిట్ భావించి ఆమెను సెలెక్ట్ చేసింది.