గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (11:44 IST)

కేజీఎఫ్ చాప్టర్ 2.. యడ్డీకి యష్ విన్నపం.. ఏంటది?

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్.. బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘనవిజయమం సాధించింది. దీంతో ఈ సినిమా హీరో యష్‌ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ రానుంది. ఇప్పటికే కేజీఎఫ్‌ 2 చిత్రీకరణ చాలావరకు పూర్తయ్యింది. 
 
భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్‌ బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ రవీనా టండన్ నటిస్తోంది. తెలుగు నుంచి విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నటుడు యష్‌ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఓ విన్నపం చేశాడు. 
 
అయితే నిర్మాణానికి కావలసిన సాంకేతిక స్టూడియోలు మాత్రం ఇంకా అక్కడి వారికి అందుబాటులో లేవని.. అందుకే కర్ణాటకలోనే ఓ స్టూడియో ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని హీరో యష్ ప్రభుత్వాన్ని కోరాడు.