శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (10:56 IST)

పవన్-త్రివిక్రమ్ సినిమాలో ఖుష్భూ.. స్టాలిన్ తర్వాత తమ్ముడితో ఖుష్భూ

ఖుష్భూకు తమిళనాట సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఖుష్బూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ధృవీకరించింది. దాదాపు 9 సంవత్సరాల తరువాత

ఖుష్భూకు తమిళనాట సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఖుష్బూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ధృవీకరించింది. దాదాపు 9 సంవత్సరాల తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. తెలుగులో తన చివరి సినిమా 'స్టాలిన్' అనీ .. ఆ తరువాత మళ్లీ తాను చేయలేదని చెప్పుకొచ్చింది. 
 
చిరంజీవితో చేసిన ఇంత కాలానికి ఆయన తప్పుడు పవన్‌తో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పింది. త్రివిక్రమ్ వినిపించిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉందనీ.. తన పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందని వెల్లడించారు. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా తన పాత్రకు న్యాయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని ఖుష్బూ వెల్లడించింది. కీర్తి సురేష్ - అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించనున్న ఈ సినిమాకి, ఖుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ యూనిట్ అంటోంది.