మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (13:36 IST)

కియారా అద్వానీకి ఆర్‌సీ15 టీమ్ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్

Kiara and Siddharth
కియారా అద్వానీకి ఆర్‌సీ15 టీమ్ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్ అందుకుంది. ఈ సినిమా నటుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్‌తో సహా ఆర్సీ15 తారాగణం, సిబ్బందితో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహం సందర్భంగా  సర్ ప్రైజ్ వీడియోను విడుదల చేశారు. 
 
కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ప్రత్యేక వీడియోలో, కొత్త జంటకు హ్యాపీ వైవాహిక జీవితాన్ని కోరుకుంది. ఈ వీడియోను కియారా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంకా RC15 టీమ్‌కి కృతజ్ఞతలు తెలియజేసింది. 
 
ఇంకా ఆమె ఇన్ స్టాలో ఇలా రాసింది. "ఇది మాకు చాలా మధురమైన ఆశ్చర్యం. ప్రేమను అనుభవిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. " అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.