''కొడి''లో ధనుష్ డబుల్ షేడ్స్.. త్రిష గ్లామర్ ఓవర్ డోస్.. ట్రైలర్ మీరే చూడండి..
ధనుష్- త్రిష- అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో రానున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'కొడి'. దీపావళి రేసులోవున్న ఈ చిత్రానికి సంబంధించి 2 నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. దీనికి సినీ లవర్స్ నుంచి మ
ధనుష్- త్రిష- అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో రానున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'కొడి'. దీపావళి రేసులోవున్న ఈ చిత్రానికి సంబంధించి 2 నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. దీనికి సినీ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. కేవలం 24 గంటల్లో 9 లక్షలకుపైగా హిట్స్ రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీగా ఉన్నారు. ఇందులో హీరో ధనుష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
ఇందులో త్రిష గ్లామర్ డోస్ బాగానే పెంచిందనే టాక్ నడుస్తోంది. ధనుష్‌తో కలిసి ఆమె కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ అంటోంది. తెలుగులో 'ధర్మయోగి' పేరుతో రానుంది. త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించగా, తమిళ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం ఆడియో ట్రాక్ పాటు ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ట్రైలర్‌లో ధనుష్ డ్యూయల్ షేడ్స్ ద్వారా ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు. ఇక కొడి చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.