పుట్టపర్తి సాయి బాబా చిత్రం ఏమయింది? కోడి రామకృష్ణ లైన్లోకి వచ్చారా?
పుట్టపర్తి సాయిబాబాపై చిత్రాన్ని తీస్తున్నట్లు.. దర్శకుడు కోడిరామకృష్ణ చాలాకాలం క్రితం ప్రకటించాడు. సాయిబాబా వర్థంతి సందర్భంగా.. ఈ విషయాన్ని కొన్ని సంవత్సరాలు క్రితం చెప్పాడు. ఇందుకు ఆయన శిష్యులు.. ఏరికోరి కోడిని సెలెక్ట్ చేశారు. కూలంకషంగా బాబా జీవితకథను తెలుసుకుని తెరకెక్కించే పనిలో వుండగా.. కోడి రామకృష్ణకు కాస్త అనారోగ్యం కల్గింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు.
ఇప్పటికైతే కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన వెంటనే.. సాయిబాబా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు. అయితే.. సాయిబాబాగా పలువురిని పరిశీలించాక మలయాళీ యాక్టర్ శ్రీజిత్ విజయ్‌ను పుట్టపర్తి సాయి బాబా పాత్రలో నటించజేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో సాయిబాబా పుట్టపర్తి ఆశ్రమం కూడా కనిపించబోతుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని పుట్టపర్తి సాయిబాబా పుట్టిన 10 రోజుల దగ్గరి నుండి చిత్రీకరించారు.